సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి, మణుగూరులో జరిగిన సీఐటీయూ 4వ మండల మహాసభలో మాట్లాడుతూ, కార్మిక హక్కుల పరిరక్షణకై కార్మికులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచాలని చూస్తూ కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నాయని ఆయన విమర్శించారు.