మణుగూరు మండలంలో ఓసి విస్తరణలో భాగంగా శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఆదివాసీ రైతులు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు మా భూములను సింగరేణికి అక్రమంగా కట్టబెట్టాలని చూస్తుందని, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా గ్రామసభ నిర్వహించకుండా సంతకాల సేకరణ చేపట్టడం అమానుషమని మండిపడ్డారు. ఎమ్మార్వో, ఎంపీడీవోలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.