భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం అశ్వాపురం రేంజ్ పరిధిలోని కృష్ణసాగర్ బీట్‌లో సుమారు రెండు హెక్టార్ల మేర పోడు సాగు కోసం అడవిని నరికివేసినట్లు సమాచారం. మణుగూరు క్రాస్‌రోడ్డు–అశ్వాపురం ప్రధాన రహదారికి కేవలం 150 మీటర్ల దూరంలోనే ఈ భారీ నరికివేత జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంత సమీపంలోనే చెట్ల నరికివేత జరిగినప్పటికీ అటవీశాఖ అధికారులు గుర్తించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.