పినపాక మండలం ముత్యాలమ్మ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ముత్యాలమ్మ నగర్ గ్రామంలో జనావాసాల మధ్య సెల్ టవర్ అక్రమ నిర్మాణంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేయగా, సెల్ టవర్ పనులు నిలిపివేయాలని సంబంధిత ఇంటి యజమానికి, కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేశారు.