పాల్వంచ లిమిటెడ్: ఉచిత వొకేషనల్ శిక్షణ ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాకలోని ఆళ్లపల్లి మండలంలో పాల్వంచ నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో మహిళా సాధికార కేంద్రంలో ఉచిత వొకేషనల్ శిక్షణ బుధవారం ప్రారంభమైంది. పురుషులకు వెల్డర్, ఎలక్ట్రికల్, ఫిట్టర్ (6 నెలలు), రిఫ్రిజిరేషన్ & ఏసీ, సోలార్ (4 నెలలు) కోర్సులు అందిస్తున్నారు. మహిళలకు కంప్యూటర్, ట్యాలీ, బ్యూటిషియన్, టైలరింగ్ వంటి 3 నెలల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 8వ తరగతి నుంచి ఐటీఐ/డిగ్రీ వరకు అర్హత, 18–35 సంవత్సరాల వయస్సు గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణ సమయంలో నెలకు రూ.1000–1250 స్టైపెండ్ లభిస్తుంది. ఆసక్తిగలవారు పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తులు సమర్పించాలని ఎస్సై ఎం.సోమేశ్వర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్