పేకాట ఆడుతున్న నలుగురుని ఏడుళ్ళ బయ్యారం పోలీసులు అరెస్ట్ చేశారు. పినపాక మండలం టి. కొత్తగూడెం గ్రామ శివారులో కొందరు పేకాట ఆడుతుండగా దాడి చేశామని, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.
5,100 నగదు, ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని, మరో నలుగురు పరారయ్యారని ఎస్ఐ రాజ్ కుమార్ వెల్లడించారు. కేసు నమోదు చేశామని ఆయన వివరించారు.