పినపాక మండలం దుగినేపల్లి, చేగర్శల గిరిజన సొసైటీల మధ్య నెలకొన్న వివాదాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని శాంతియుతంగా పరిష్కరించాలని సీపీఐ (ఎంఎల్) డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. చేగర్శల గ్రామంలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సొసైటీ సభ్యులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు.