పినపాక: విస్తృతంగా వాహనాల తనిఖీలు

పినపాక మండలం ఏడూల బయ్యారం క్రాస్ రోడ్ లో మంగళవారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, పరిమితికి మించి నగదు, బంగారం, వెండి వెంట తీసుకువెళ్లేవారు తగిన ఆధారాలు చూపించాలని, లేని యెడల వాటిని స్వాధీనం చేసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్