పినపాక మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది జాబితా విడుదల చేశామని పినపాక ఎంపీడీవో సునీల్ కుమార్ తెలిపారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆ జాబితాను ప్రదర్శించినట్లు తెలియజేశారు. ఫిబ్రవరి 2, 3 తేదీలలో అభ్యంతరాలను స్వీకరించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నేడు తుది జాబితా ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.