ఏపీఎం విజయ మంగళవారం పినపాక మహిళా సమాఖ్య కార్యాలయంలో మాట్లాడుతూ, కొర్రమీను పెంపకం ద్వారా రైతులు లాభాలు పొందవచ్చని తెలిపారు. కనీసం అర ఎకరం పొలం ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులని, కొర్రమీను సాగు చేసుకునే రైతులకు ఆక్వా నుండి రూ. 4.5 లక్షల రుణం అందుతుందని చెప్పారు. ఆరు నెలల్లో రైతులకు లాభాలు మొదలవుతాయని, అలాగే పిట్టల పెంపకం, నాటు కోళ్లు, మేకలు, గొర్రెలు పెంపకం కూడా చేపట్టవచ్చని సూచించారు.