పినపాక మండలం ఈ బయ్యారం ఎలిసిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల వీచిన గాలివాన కారణంగా సుమారు 8 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ శాఖ ఏడీఈ ఉమామహేశ్వరరావు, ఏఈ వేణుగోపాల్‌తో కలిసి దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, స్తంభాలను గురువారం పరిశీలించారు. ఈ ఘటనలో సుమారు రూ. 60 వేలకుపైగా నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడించారు.