కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ, పినపాక మండలం ఈ. బయ్యారం క్రాస్ రోడ్ లో ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ చర్యలకు పాల్పడుతోందని నాయకులు ఆరోపించారు. విచారణను నిలిపివేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.