పినపాక మండల పీఆర్టీయూ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. పినపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా వేర్పుల రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా కె. శ్రీకాంత్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు బి. భాస్కర్ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.