పినపాక: రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలి

పినపాక భూపాలపట్నం గ్రామ పంచాయతీలో నూతన రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేయాలని సర్పంచ్ తోలం స్వప్న మంగళవారం డిమాండ్ చేశారు. బయ్యారం నుంచి విడిపోయి భూపాలపట్నం కొత్త పంచాయతీగా ఏర్పడి పదేళ్లవుతున్నా, నేటికీ సొంతంగా రేషన్ షాపు లేకపోవడం దారుణమన్నారు. దీంతో లబ్ధిదారులు బియ్యం కోసం కిలోమీటర్ల దూరం ఉన్న బయ్యారం వెళ్లాల్సి వస్తోందని, అధికారులు వెంటనే స్పందించి గ్రామంలోనే రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్