పినపాక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈఓ వెంకటేశ్వర్లుతో కలిసి కేంద్రంలో ధాన్యం తూకం వేసే విధానం, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, టెంట్ వంటి వసతులు కల్పించాలని సూచించారు.