పినపాక: కేరళపై తెలంగాణ విజయం

పినపాక ఏడూళ్ళ బయ్యారంలో జరుగుతున్న 79వ జాతీయ కబడ్డీ టోర్నీలో శనివారం తెలంగాణ అండర్-17 జట్టు విజయం సాధించింది. కేరళతో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో తెలంగాణ 62-58 పాయింట్ల తేడాతో విజయం నమోదు చేసుకుంది. చివరి నిమిషం వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్