పినపాక మండలంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొనే కార్మికుల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఎంపీడీవో సంకీర్త్ సూచించారు. మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ సెక్రటరీలతో నిర్వహించిన సమీక్షలో, గ్రామాల వారీగా హాజరు తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.