జనగణన 2027 ముందస్తు ప్రణాళికలో భాగంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేసిన ప్రాంతాలలో నవంబర్ 10 నుండి 30 వరకు ప్రీ-టెస్ట్ మొదటి దశ నిర్వహించబడుతుందని సెన్సెస్ ఆపరేషన్ జాయింట్ డైరెక్టర్ జ్ఞాన శేఖర్ తెలిపారు. మంగళవారం పినపాక రైతు వేదికలో జరిగిన ఇనామినేటర్స్ సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ఈ సందర్భంగా ఇండ్ల జాబితా, ఇండ్ల గణన సర్వే చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.