33 కేవీ మామకన్ను ఫీడర్ విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఆదివారం ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ ఏఈ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.