పినపాకలోని 11కేవీ ఫీడర్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ వేణుగోపాల్ శుక్రవారం తెలిపారు. ఈ అంతరాయం బయ్యారం, బయ్యారం క్రాస్ రోడ్డు, ఎంపీడీఓ, ఎంఆర్ది కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రి, కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రాంతాల్లో ప్రభావం చూపుతుంది.