తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదివారం సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం సారపాక ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. ఏజెన్సీ ప్రాంత గిరిజన రైతుల భూ సమస్యల పరిష్కారానికి ఆయన జిల్లాకు వచ్చారు. సోమవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం అనంతరం, అధికారులతో భూ సమస్యలు, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు.