భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాకకు చెందిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మరణంపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండీ నాగిరెడ్డి బుధవారం ఉస్మానియా ఆసుపత్రిలో నివాళులర్పించారు. మృతురాలి కుటుంబానికి సీఎం ఆదేశాల మేరకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా, రూ. కోటి ప్రమాద బీమా, ఇందిరమ్మ ఇల్లు మరియు తల్లికి ఉద్యోగం కల్పిస్తామని మంత్రి ప్రకటించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేశామని, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బాధితులకు హామీ ఇచ్చారు.