రోడ్డు ప్రమాదంలో రైతు కొండన్నకి తీవ్ర గాయాలు

బూర్గంపాడు మండల కేంద్రంలో దోమల వాగు సమీపంలో రోడ్డు పై వరదకు ఏర్పడ్డ భారీ గుంతల్లో శనివారం మండల కేంద్రానికి చెందిన బర్ల కొండయ్య అనే రైతు తన ద్విచక్ర వాహనంపై పొలం వద్దకు వెళ్తుండగా క్రింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం నిమిత్తం భద్రాచలం తరలించారు. భద్రాచలం నుండి ఇంకా మెరుగైన వైద్యం అవసరం అని ఖమ్మంకి తరలించారు.

సంబంధిత పోస్ట్