భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని మొండికుంట గ్రామంలోని తుమ్మల చెరువులో మంగళవారం మత్స్యకారులు పోసిన రొయ్య పిల్లలు గోదావరి జలాలకు ఎదురీదుతూ సుమారు 1.5 కి.మీ దూరంలోని గొందిగూడెం మారెళ్లపాడు ఎత్తిపోతల డెలివరీ పాయింట్ వద్దకు చేరుకున్నాయి. నీటిలో ఉండాల్సిన రొయ్య పిల్లలు గోడలను అంటిపెట్టుకుని కనిపించడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈ వింత దృశ్యం గోడలపై రొయ్య పిల్లల 'క్యాట్‌వాక్'గా మారింది.