మూఢనమ్మకాల పేరుతో హింసిస్తే కఠిన చర్యలు..ఎస్సై

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం జింకలగూడెంలో చేతబడి నెపంతో వృద్ధురాలిపై దాడి ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. జూలైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. దాడిలో వృద్ధురాలిని తాళ్లతో కొట్టి, చెట్టుకు ఎక్కించి, కింద మేకులు కొట్టినట్లు పోలీసులు తెలిపారు. షేక్ మదర్, షేక్ ఫయాజ్, కరీముల్లాతో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. మూఢనమ్మకాల పేరుతో హింసిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕