భట్టుపల్లి భూ రీ-సర్వేను పర్యవేక్షించిన సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం భట్టుపల్లి గ్రామంలో జరుగుతున్న భూ రీ-సర్వే పనులను సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ మంగళవారం పరిశీలించారు. DGPS పరికరాలతో కొలతలు పారదర్శకంగా పక్కాగా పూర్తి చేయాలని, రైతుల సమక్షంలోనే సరిహద్దులు నిర్ణయించి వారి సందేహాలను నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూ యజమానులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕