పినపాకలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామ స్థాయిలో కార్యకర్తలు ఇప్పటికీ పార్టీని నమ్ముకుని ఉన్నారని, వారి కృషితోనే పార్టీ బలంగా ఉందని కొనియాడారు.