పినపాక తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని తహసీల్దార్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం, న్యాయం, సోదరభావం యొక్క ప్రాధాన్యతను గుర్తు చేశారు.