బూర్గంపాడులోని గౌతమిపురం కాలనీకి చెందిన కొమ్ము సంధ్య (24) ఇటీవల పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. ఆమెకు కుక్కునూరు మండలం వింజరానికి చెందిన సుధాకర్తో నాలుగేళ్ల కిందట వివాహం జరగగా సారపాకలో ఉంటున్నారు. ఏడాది కిందట సుధాకర్ అనారోగ్యంతో మృతి చెందినప్పటి నుంచి పుట్టింట్లో ఉంటున్న సంధ్య భర్త మరణంతో మనస్తాపానికిగురై ఈ నెల 9న పురుగులమందు తాగింది.