భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన పోలేబోయిన నర్వయ్య, నాగేంద్ర దంపతులు మరణించడంతో వారి ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మిగిలారు. పెద్ద కుమార్తె సంజీవరాణి సెరిబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడుతుండగా, చిన్న కుమార్తె అశ్వత విద్యార్థిని. ప్రస్తుతం ఈ చిన్నారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వీరి భవిష్యత్తు కోసం ప్రభుత్వం, దాతలు, ప్రజాప్రతినిధులు మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. సహాయం చేయాలనుకునే వారు 7893110548 నంబరుకు సంప్రదించవచ్చు.