ఖరీఫ్ సీజన్‌లో యూరియా కొరతతో బూర్గంపాడు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఫర్టిలైజర్ యాప్‌లో సహకార సంఘాల వద్ద యూరియా నిల్వలు 'నిల్'గా చూపుతుండగా, ప్రైవేట్ డీలర్ల వద్ద మాత్రం అధిక స్టాక్ అందుబాటులో ఉంది. దీంతో రైతులు ప్రైవేట్ దుకాణాల్లో ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. సహకార సంఘాల్లో తగినంత యూరియా అందుబాటులో ఉంచి, ప్రభుత్వ ధరకే విక్రయించాలని రైతులు కోరుతున్నారు.