పినపాకలో వైఎస్సార్‌ 17వ వర్ధంతి వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాకలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం కేంద్రంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతిని కాంగ్రెస్‌ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ కమిటీ నాయకుడు కాటం వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూలపల్లి సుధాకర్‌రెడ్డి, సారపాక సర్పంచ్‌ కిషోర్‌నాయక్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్