టేకులపల్లిలో 4 కిలోల గంజాయి పట్టివేత

అక్రమంగా గంజాయి తరలిస్తుండగా టేకులపల్లి పోలీసులు పట్టుకున్నారు. సీఐ టి. సురేష్ వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా ఏఆర్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ దుంప ప్రసాద్ జల్సాలకు అలవాటు పడి గంజాయి విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో ఒడిశా నుంచి గంజాయి తరలిస్తుండగా వెంకట్యాతండా వద్ద వాహన తనిఖీల్లో పట్టుకున్నామని, 4. 130 కిలోల గంజాయితో పాటు ఆటో, మొబైల్ స్వాధీనం చేసుకున్నామని, గంజాయి విలువ రూ. 2. 06 లక్షలు ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్