ఉపరితల గనుల్లో ఎండలు తీవ్రంగా ఉన్నందున ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సింగరేణి డైరెక్టర్ కే. వెంకటేశ్వర్లు ఆదేశించారు. గురువారం ఇల్లందు, కోయగూడెం, జేకే-5, ఓసీలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు పని స్థలాలను సందర్శించారు. రోజు వారీ బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ బ్లాస్టింగ్, లోడింగ్ పనులను జీఎం. వి. కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు.