ఇల్లందు సుదిమళ్ల యూత్ ట్రైనింగ్ సెంటర్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో జరిగిన సెంట్రింగ్ మేస్త్రి శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. అదనపు కలెక్టర్ విద్యా చందన 60 మంది శిక్షణ పొందిన సభ్యులకు సర్టిఫికెట్లు, సేఫ్టీ క్యాప్, టీ షర్ట్లను అందజేశారు. ఈ శిక్షణ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.