ఇల్లందు మండలం కొమరారం గ్రామంలో పీవైఎల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల వర్ధంతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కామ్రేడ్ రవి జెండా ఆవిష్కరణ చేశారు. జిల్లా, మండల నాయకులు భగత్ సింగ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బ్రిటిష్ వలస పాలనపై తిరుగుబాటు జెండా ఎత్తి విప్లవ అగ్ని రగిలించారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.