శనివారం ఇల్లందు మున్సిపల్ కార్యాలయం ఎదుట మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని టీయూసీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దీనిపై స్పందించిన మున్సిపల్ ఛైర్మన్ దొడ్డ కిరణ్ మిత్ర, కమిషనర్ శ్రీకాంత్, యూనియన్ జిల్లా కార్యదర్శి యాకుబ్ షావలిని, మృతుల కుటుంబాలను తమ చాంబర్కు పిలిపించి చర్చలు జరిపారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని టీయూసీఐ నేతలు డిమాండ్ చేశారు.