ఈనెల 5, 6 తేదీలలో పాల్వంచలో ఎస్ఎఫ్ఎ జిల్లా మహాసభలు జరగనున్నాయని, జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బయ్య అభిమణ్యు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ఇల్లందు వివిధ సెంటర్లలో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.