ఇల్లందు మండలం కొమరారం గ్రామంలో బుధవారం నిర్వహించిన పీవైఎల్ సమావేశంలో, నూతన సంవత్సరాన్ని కేవలం మద్యం సేవించి కాకుండా సృజనాత్మక ఆలోచనలతో స్వాగతించాలని పీవైఎల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు మోతిలాల్ పిలుపునిచ్చారు. న్యూ ఇయర్ పేరుతో వేల కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరగడం ఆందోళనకరమని, యువత వ్యసనాలకు బానిసై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఆయన హితవు పలికారు.