మార్కెట్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాంబాబు తెలిపారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం పాలకవర్గం సమావేశం నిర్వహించారు. మార్కెట్ ను మరింత అభివృద్ధి చేసేందుకు కార్యచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. అందుకు పాలకవర్గం, ఉద్యోగులు కృషి చేయాలన్నారు. కాగా, మార్కెట్ సెక్రటరీ ప్రవేశ పెట్టిన పలు తీర్మానాలకు పాలకవర్గం ఆమోదం తెలిపింది.