ఇల్లందు పట్టణంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి, డప్పు దరువులకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నృత్యాలు చేశారు.