ఇల్లందు: ఎకరాకు 50 వేలు పరిహారం ఇవ్వాలి: సీపీఎం

మొంథా తుఫాను కారణంగా జిల్లాలో పత్తి, వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయని, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఇల్లందులోని సీపీఎం కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 50 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తుఫాను ముందు, తర్వాత కురిసిన భారీ వర్షాలు పంటలను నాశనం చేశాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్