ఇల్లందు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

బుధవారం ఇల్లందు మండలంలో శెట్టిపల్లి నుంచి ఇల్లందు వస్తున్న ఆటో మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లలిత, లక్ష్మీకాంత్, నాగేంద్ర అనే ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల కథనం ప్రకారం, చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్