ఇల్లందు: అలుగువాగు బ్రిడ్జి నిర్మాణానికి రూ. 20 లక్షలు

ఇల్లందు టౌన్ ఇల్లందులపాడు హిందూ శ్మశాన వాటిక అలుగు వాగు మీద బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 20 లక్షలను తన ఎంపీ కోట నిధుల నుంచి కేటాయిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రకటించారు. మంగళవారం ఇల్లందులో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో వద్దిరాజు పాల్గొన్నారు. రెండో వార్డు మాజీ కౌన్సిలర్ కటకం పద్మావతి ఎంపీ వద్దిరాజుకు వినతిపత్రం అందజేయగా, ఆయన స్పందించి రూ. 20 లక్షలు కేటాయించారు.

సంబంధిత పోస్ట్