మంగళవారం ఇల్లందు మండలంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.