ఇల్లందులోని ముకుందాపురంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 48,920 నగదు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఇల్లందు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, సబ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్, సుమంత్, రామారావు, సిబ్బంది పాల్గొన్నారు.