టేకులపల్లి మండలం బొమ్మనపల్లి విద్యుత్ ఉపకేంద్రంలో రెండో శనివారం మరమ్మతుల్లో భాగంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9: 30 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.