టేకులపల్లి: 350 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

టేకులపల్లి మంగళితండా సమీపంలోని పాయంగుంపులో మాడే లక్ష్మయ్య ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 350 బస్తాల రేషన్ బియ్యంను శనివారం రాత్రి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఇల్లెందు పౌరసరఫరాల డీటీ రాంబాబు పంచనామా నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని ఇల్లెందు ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించారు.

సంబంధిత పోస్ట్