టేకులపల్లి మండలంలోని బేతంపూడికి చెందిన రైతు బానోత్ కిషన్, ఈ నెల 11వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆయన భార్య కమలిబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇలాగే వెళ్లి తిరిగి వచ్చినందున, ఈసారి కూడా వస్తాడని కుటుంబ సభ్యులు భావించారు. అయితే, కిషన్ ఆచూకీ లభించకపోవడంతో, కమలిబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.