టేకులపల్లి మండలం సులానగర్ గ్రామంలో మంగళవారం భారీ వర్షం, గాలిదుమారంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో కోరం సంపత్ అనే రైతుకు చెందిన దుక్కిటెద్దు విద్యుదాఘాతంతో మరణించింది. సుమారు లక్ష రూపాయల విలువైన ఎద్దును కోల్పోయిన రైతుకు ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు నష్టపరిహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.